
మేడ్చల్: జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతి తీవ్ర సంచలనం రేపింది. ఘట్ కేసర్ మండలం చౌదరిగూడకు చెందిన పసులూరి కిరణ్(34) వినాయక విగ్రహం కొనుగోలుకు వెళ్లగా అక్కడి విక్రయదారులతో, కిరణ్‌కు వాగ్వాదం జరిగింది. అదికాస్తా పెద్దదై కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి, విగ్రహాలు విక్రయిస్తున్న వారి మధ్య ఘర్షణ చెలరేగింది. విక్రయదారులు జరిపిన దాడిలో కిరణ్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన అతని బంధువులు, స్నేహితులు వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





