
ఠాణె: ప్రధాని మోదీని ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గరలీ వోహ్రా (81) ఇటీవల కలిశారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఠాణెలో ఉంటున్న ఆయన.. భాజపా ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు సంబంధించిన బిల్డర్లు నకిలీ పత్రాలతో తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని మోదీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ విచారణ కోరానని, త్వరలో ఆ కోరిక నెరవేరుతుందన్న ధీమాను ఆదివారం ఆయన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో ఉన్న బీఎన్‌ హైస్కూల్‌లో మోదీ, తాను కలిసి చదువుకున్నామని వోహ్రా తెలిపారు. భయందర్‌లోని నవ్‌ఘర్‌లో ఉన్న 2,810 చదరపు మీటర్ల భూమి విషయంలో వివాదం నెలకొందని వోహ్రా వివరించారు. 1989లో తాను దీనిని కొన్నానని, కానీ దానిని స్వయం బిల్డర్స్, సెవెన్‌ ఎలెవన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు 2011లో ఆక్రమించుకున్నాయని వెల్లడించారు. ఈ సంస్థలు ఎమ్మెల్యేకు సంబంధించినవని తెలిపారు. మోదీతో భేటీ తర్వాత ఆ రెండు సంస్థలకు మున్సిపల్‌ అధికారులు సమన్లు జారీ చేశారని వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





