ఎవరైనా సరే బరువు పెరగాలనుకున్నప్పుడు ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మిమ్మల్ని వారు చెక్ చేసి ఎందుకు బరువు పెరగట్లేదు మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో చెక్ చేసి అసలు కారణాలు ఏంటో కనుక్కుని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. అంతేకాకుండా మీ ఎత్తుకు తగ్గ వెయిట్ ఎంత ఉండాలి? ఏమేం తినాలి? ఎంత వర్కౌట్స్ చేయాలి? అనే బోలెడు విషయాలు చెప్పడమే కాకుండా అవసరమైతే డైటీషియన్ వంటి ఎక్స్పర్ట్స్ కూడా కలవమని చెబుతారు. బరువు పెరగాలనుకుంటే ముందుగా సరైన ఆహారాన్ని తినండి. తినే ఆహార పరిమాణం కూడా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ ఫుడ్ కాకుండా రోజుకి 5, 6 సార్లు కొద్దికొద్దిగా తినాలని అధ్యయనాలు చెబుతున్నాయి . దీంతో మీ కడుపు నిండుతుంది. ఎలాంటి సమస్య లేకుండా బరువు పెరుగుతారు. మనం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. అయితే, తినమన్నాం కదా అని జంక్ ఫుడ్ వంటివి తినొద్దు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, చిప్స్ వంటివాటిని పక్కనపెట్టాలి. వీలైతే మీరు రోజులో ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసుకుని ఆ ఫుడ్‌ని తీసుకోవాలి. మీకు ఆకలి తక్కువగా ఉంటే రోజుకి ఐదు నుండి ఆరుసార్లు తినాలి. భోజనానికి ముందు, తర్వాత లిక్విడ్స్ తీసుకోవాలి. భోజనంతో పాటు వద్దు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అవసరమైనంత పరిమాణంలో తీసుకోండి. ఓట్స్, గ్రెయిన్స్‌ని తీసుకోండి. వీటిని నీటితో కాకుండా పాలతో కలిపి తయారుచేయండి. అందులో తేనె, డ్రై ఫ్రూట్స్, నట్స్ కలిపి తినండి. జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటూ అవకాడో, నట్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వంటి హెల్దీ ఆయిల్స్‌తో సలాడ్స్ తయారుచేసుకుని తినండి. అయితే, ఏవైనా సరే తక్కువ పరిమాణంలో డాక్టర్ చెప్పిన పరిమాణంలోనే తీసుకోండి. అంతేకానీ, ఎక్కువగా తీసుకోవద్దు. మజిల్స్ పెరగాలనుకుంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ హెల్ప్ చేస్తుంది. ఫ్రీ వెయిట్స్, వెయిట్ మెషిన్స్, బాడీ వెయిట్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వాడండి. అయితే, రెగ్యులర్‌గా వద్దు వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే చేయాలి. లేదా మజిల్స్‌కి రెస్ట్ ఉండదు. అవి కోలుకోవడానికి కాస్తా టైమ్ ఇవ్వండి. స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ వంటి కాంపౌండ్ వర్కౌట్స్ చేయండి. వర్కౌట్స్‌ని ఎక్కువ టైమ్‌లో మెల్లిగా కాకుండా, తక్కువ సమయంలో కాస్తా తీవ్రంగానే చేయండి. వీటితో పాటు మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. దీంతో మజిల్స్ కోలుకుంటాయి. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మజిల్స్ పెరుగుతాయని మాత్రం పౌడర్స్, ట్యాబ్లెట్స్, ప్రోడక్ట్స్ తీసుకోవద్దు. దీంతో మీ టైమ్, డబ్బు రెండూ వేస్ట్ అవుతాయి. మీకు మీరుగానే ఏ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. జిమ్ ట్రైనర్, పర్సనల్ ట్రైనర్ సలహా తీసుకుంటే గాయాలవ్వవు.