
దిల్లీ: అత్యాధునిక సాంకేతికతలైన కృత్రిమ మేధ (ఏఐ), క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగాల్లో అగ్రశ్రేణి దేశాల్లో భారత్‌ కూడా ఒకటి కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దీనికి అవసరమైన విధానాల రూపకల్పనతో పాటు ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించి సహకారాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీలో మోదీ ప్రసంగించారు. దేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్‌ పరిశ్రమ మధ్య సహకారం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో, మౌలికసదుపాయాల కల్పనలో, ప్రతిభావంతులైన నిపుణుల లభ్యతలో మన దేశానికున్న సానుకూలమైన అంశాలను వివరించారు. నవోన్వేషణలు, అత్యాధునిక సాంకేతికతలు, శిక్షణలు తదితరాల్లో పరిశ్రమలు పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ సాంకేతికతలపై కోటి మందికి శిక్షణ లక్ష్యాన్ని వివరిస్తూ ఈ రంగంలో కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ప్రపంచస్థాయి సామర్థ్యాలను సొంతం చేసుకోవాలన్నారు. సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0 కింద కల్పిస్తున్న అవకాశాలపై సీఈవోలు సంతృప్తివ్యక్తం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





