
డిగ్రీ పూర్తయింది. ప్రస్తుతం ఎస్‌ఐ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్నాను. రాష్ట్ర స్థాయి, కేంద్రంలో ఉన్న ఎస్‌ఐ పోస్టుల్లో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి? పని ఒత్తిడి ఎక్కడ ఎలా ఉంటుంది? వేటిలో చేరితే ఆకర్షణీయ వేతనం, మేటి భవిష్యత్తు సొంతమవుతుంది? రా ష్ట్ర, కేంద్ర ఎస్‌ఐ పోస్టుల్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? అనే ప్రశ్నకు ఒకే రకమైన సమాధానం ఉండదు. స్వస్థలానికి దగ్గరగా పనిచేయడంపై ఆసక్తి ఉంటే రాష్ట్ర పోలీసు ఎస్‌ఐకి, కొంత క్రమబద్ధమైన విధులు కోరుకుంటే సీఐఎస్‌ఎఫ్‌కు, నేర పరిశోధనలో ఆసక్తితో పాటు మెరుగైన ప్రారంభ మూలవేతనం ఆశిస్తే సీబీఐ ఎస్‌ఐకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అయితే, పని ఒత్తిడి అనేది శాఖ పేరు కంటే పోస్టింగ్, సిబ్బంది సంఖ్య, అప్పగించిన బాధ్యతలపై ఎక్కువగా ఆధారపడుతుంది. భవిష్యత్తులో పదోన్నతులు.. ఖాళీలు, సీనియారిటీ, సేవా నిబంధనలు, శాఖాపరమైన పరీక్షలు, పనితీరుపై ఆధారపడతాయి. ఏ శాఖలోనూ వేగవంతమైన పదోన్నతికి హామీ లేదు. ప్రస్తుతం రాష్ట్ర ఎస్‌ఐ, సీపీఓ రెండింటికీ సన్నద్ధమవుతూ, ఆసక్తి ఉంటే సీజీఎల్‌ కోసమూ ప్రయత్నించండి. ఉమ్మడి అంశాలతో పాటు కేంద్ర పరీక్షలకు ఇంగ్లిష్, రాష్ట్ర పరీక్షలకు స్థానిక సిలబస్‌పై దృష్టిపెట్టండి. రాత పరీక్షకు సమాంతరంగా శారీరక సాధన కొనసాగిస్తూ, ప్రతి పోస్టుకూ వయసు, శారీరక వైద్య ప్రమాణాలను సంబంధిత నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





