
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24ు ప్రాతినిధ్యం ఉందని, మొత్తం లోక్సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు.