
నీళ్ల సీసా వెంటపెట్టుకుని మరీ నీళ్లు తాగేవారి సంఖ్య ఎక్కువే. మంచి విషయమే కానీ... దాన్ని ఎన్నాళ్లకోసారి శుభ్రం చేస్తారు? అందులో ఉండేవీ నీళ్లే కదా! ప్రత్యేకంగా శుభ్రం చేయాలా అనకండి. నీ ళ్ల సీసా వెంటపెట్టుకుని మరీ నీళ్లు తాగేవారి సంఖ్య ఎక్కువే. మంచి విషయమే కానీ... దాన్ని ఎన్నాళ్లకోసారి శుభ్రం చేస్తారు? అందులో ఉండేవీ నీళ్లే కదా! ప్రత్యేకంగా శుభ్రం చేయాలా అనకండి. ఎందుకంటే, ఈ చిన్న నిర్లక్ష్యమే ఆరోగ్యానికి ముప్పు తీసుకురావొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అది ఎలాగంటే... సీసాను నోటికి ఆనించి నీళ్లు తాగినప్పుడు, మన పెదవులపై ఉండే లాలాజలం, చర్మంపై ఉండే బ్యాక్టీరియా సీసాలకు అతుక్కుపోతాయి. దీనికి తోడు మనం బాటిల్‌ను తెరిచి పెట్టడం వల్ల గాలిలోని దుమ్మూ సూక్ష్మ క్రిములు అందులో చేరతాయి. తేమగా ఉండే ఆ వాతావరణం క్రమంగా బ్యాక్టీరియా, ఫంగస్‌ పుట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా మారుతుంది. దీంతో కడిగి ఆరబెట్టని బాటిళ్లలో కేవలం కొద్ది గంటల్లోనే కోట్ల కొద్దీ హానికారక క్రిములు అభివృద్ధి చెందుతాయట. కడగని బాటిళ్లలో ఈ-కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు చేరతాయి. అవి నీటి ద్వారా కడుపులోకి వెళ్తాయి. దీనివల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో పాటు... ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అలానే ఒక్కోసారి బాటిళ్ల అడుగుభాగంలో, మూత లోపల నల్లటి ఫంగస్‌ పేరుకుపోతుంది. మనం నీళ్లు తాగేటప్పుడు ఆ గాలి పీల్చడం వల్ల దగ్గు, ఆయాసం, అలర్జీలు, సైనస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. బ్యాక్టీరియా పేరుకుపోయిన బాటిళ్లలోని నీళ్లు తాగితే నోటి దుర్వాసనతో పాటు, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. నిత్యం ఇలా సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి పదే పదే అనారోగ్యాల పడే అవకాశం ఉంది. నీళ్ల సీసాను రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు, డిష్‌వాష్‌ లిక్విడ్‌ లేదా కాస్త బేకింగ్‌ సోడా వేసి బాటిల్‌ బ్రష్‌తో లోపలి వరకు శుభ్రంగా కడగాలి. అయితే, ప్లాస్టిక్‌ బాటిళ్లను శాశ్వతంగా వాడలేం. వీటిల్లో ఉండే రసాయనాలు బీపీఏ వంటివి నీటిలోకి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. స్టీల్, కాపర్, గ్లాస్‌ బాటిళ్లను ఎంచుకోవచ్చు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings


