
పాలకూరలో మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ వంటి థైరాయిడ్ పనితీరుకు మేలు చేసే పోషకాలు ఉంటాయి. అందుకే పాలకూర తినడం ద్వారా థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని NIH రీసెర్చ్ పేర్కొంది. సోరకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణమై బరువు అదుపులో ఉంచుతాయి. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. టొమాటోల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి థైరాయిడ్‌ను కాపాడుతుంది. బెండకాయలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెటబాలిజం రేటు మెరుగుపర్చి థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని బాగా ఉడికించి తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. క్యారెట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. అందుకే ఈ క్యారెట్ తింటే థైరాయిడ్ ఆరోగ్యం బాగుంటుంది. కాలీఫ్లవర్‌లో ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలీఫ్లవర్ బాగా ఉడికించి తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ముల్లంగిలోని పోషకాలు జీవక్రియ రేటు మెరుగుపర్చి బరువు అదుపులో ఉంటాయి. ఈ ముల్లంగిని మితంగా తీసుకుంటే థైరాయిడ్ ఆరోగ్యం బాగుంటుంది. బీట్రూట్లో నైట్రేట్స్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కాలేయాన్ని డీటాక్సిఫై చేసి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి.



