
ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్లు స్థిరంగా ఉంటాయని హెల్త్‌లైన్ తెలిపింది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల భయం, ఆందోళన వంటివి తగ్గుతాయి. నిత్యం హ్యాపీగా ఉండొచ్చు. ధ్యానం చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పనిలో, చదువులో పూర్తి ఏకాగ్రత ఉంటుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. హై బీపీ సమస్య తగ్గుతుంది. ధ్యానం చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. త్వరగా నిద్రపడుతుంది. గాఢమైన, ప్రశాంతమైన నిద్ర మీ సొంతం. ధ్యానం చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వయసుతో పాటు వచ్చే మతిమరుపు తగ్గుతుంది. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల మీ గురించి మీరు మరింత బాగా తెలుకుంటారు. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఇమ్యూనిటీ రెట్టింపు అవుతుంది. ధ్యానం చేయడం వల్ల అలసట తగ్గుతుంది. మనసు రిలాక్స్ అవుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.