
ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇలా ధ్యానంలో కూర్చుని శ్వాసపై ధ్యాస ఉంచడం వల్ల గుండె వేగం అదుపులో ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనసు కుదుటపడుతుంది. రోజులో కాసేపు మీకు నచ్చిన వారితో గడపండి. ఇలా చేయడం వల్ల బీపీ అదుపులో ఉండటమే కాకుండా ఒత్తిడి, ఆందోళన అదుపులోకి వస్తాయి. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, సోడా తాగితే బాడీ యాక్టివ్గా మారి అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతాయి. అందుకే కెఫిన్ డ్రింక్స్ తాగకండి. ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు మంచి నిద్ర చాలా అవసరం. ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. మీకు నచ్చిన హాబీకి రోజులో కొంత సమయం కేటాయించండి. పెయింటింగ్, గార్డెనింగ్, కుకింగ్, పాటలు వినడం, డ్యాన్స్ వంటివి మీ ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి. రోజూ కాసేపు ప్రకృతిలో గడపడం అలవాటు చేసుకోండి. మనసు ప్రశాంతంగా మారేందుకు ఇది మంచి మార్గం. అలాగే ఒత్తిడి, ఆందోళన కూడా అదుపులోకి వస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు కారణమయ్యే ఆలోచనలు జర్నల్లో రాయడి. ఇలా చేయడం వల్ల మీ ఫీలింగ్స్ అదుపులోకి వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొబైల్ వాడకం అదుపులో ఉంచండి. మీకు నచ్చని న్యూస్ చదవడం తగ్గించండి. సోషల్ మీడియాలో వచ్చే అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టడం తగ్గించండి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన లేకుండా ఉండొచ్చు.


