
ఆధునిక జీవనశైలిలో బరువు తగ్గుతూ ఫిట్గా ఉండాలనుకోవడం అమ్మాయిలకు పెద్ద సవాలే. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్లి బరువులు ఎత్తడం, ఆయాసం తెప్పించే వర్కౌట్లు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ ధునిక జీవనశైలిలో బరువు తగ్గుతూ ఫిట్‌గా ఉండాలనుకోవడం అమ్మాయిలకు పెద్ద సవాలే. పొద్దున్నే లేచి జిమ్‌కి వెళ్లి బరువులు ఎత్తడం, ఆయాసం తెప్పించే వర్కౌట్లు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇల్లు, ఉద్యోగం, పిల్లల బాధ్యతలతో ఊపిరి సలపని పనులతో బిజీగా ఉండే ఆడవాళ్లకు అయితే ఇది మరీ కష్టం. అలాంటివాళ్లు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా కేవలం నడకతోనే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండొచ్చట. దాన్నే ‘లింఫాటిక్‌ వాకింగ్‌’ అంటున్నారు నిపుణులు... బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నుంచి చాలామంది సెలెబ్రిటీలు ప్రస్తుతం ఈ పద్ధతినే అనుసరిస్తున్నారట. అసలు ఏంటీ లింఫాటిక్‌ వాకింగ్‌? దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి నిపుణులు ఏమన్నారంటే... మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలాగే లింఫాటిక్‌ వ్యవస్థ కూడా ఒకటి. ఇది శరీరంలో వ్యర్థాల్నీ, విష పదార్థాల్నీ బయటకు పంపి మన శరీరానికి రక్షణగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే శరీరంలో రక్త సరఫరాకి గుండె ఉన్నట్లు... ఈ లింఫ్‌ ఫ్లూయిడ్స్‌ పంపిణీ చేయడానికి మన లోపల ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదట. మనం నడిచేటప్పుడు కండరాల కదలికలు, తీసుకునే శ్వాస ద్వారా మాత్రమే శరీరంలో వీటి ప్రసరణ జరుగుతుంది. అయితే గంటల తరబడి కుర్చీలకే పరిమితమయ్యే వాళ్లల్లో దీని ప్రసరణ తగ్గి, శరీరంలో నీరు చేరడం, కాళ్ల వాపు, కడుపు ఉబ్బరం... వంటి సమస్యలూ వస్తాయంటున్నారు నిపుణులు. మనం రోజూ నడిచే సాధారణ నడకకు కాస్త భిన్నంగా నడుస్తూ... కొన్ని నియమాలు పాటించాలి. రోజంతా కూర్చోవడం వల్ల వచ్చే కడుపు ఉబ్బరం, కాళ్ల వాపులు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు చెమట రూపంలో సులభంగా బయటకు పోతాయి. అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. డెస్క్‌ జాబ్స్‌ చేసేవాళ్లకీ, ప్రయాణాలు చేసేవాళ్లకీ, భారీ కసరత్తులు చేయలేం అనుకునే వారికి ఈ లింఫాటిక్‌ వాకింగ్‌ మంచి ఎంపిక. రోజుకు కనీసం 20-30 నిమిషాలు ఈ పద్ధతిలో నడిస్తే మంచిది అంటున్నారు నిపుణులు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings


