
శ్రీకృష్ణుని ధ్యానించడంలో ఎంత ఆధ్యాత్మికత ఉంటుందో.. రాధ నామస్మరణలో అంత మాధుర్యం ఉంటుంది. ‘రాధే కృష్ణా’ అనే నామం వినిపించిన ప్రతిసారీ.. భక్తుల మనసు బృందావనాన్ని చేరుతుంది. కృష్ణుడిపై సంపూర్ణ భక్తికి ప్రతీకగా రాధను ఆరాధిస్తారు. ఆమెకు కృష్ణుడి నామమే ధ్యానం.. కృష్ణుడి స్మరణే జీవిత పరమార్థం. తన మనసు, వాక్కు, కర్మ- అన్నింటినీ భగవంతుడికే సమర్పించిన పరిపూర్ణ భక్తురాలిగా రాధను కీర్తిస్తారు. రాధను అర్థం చేసుకోవాలంటే.. ఆమె జీవితాన్ని కేవలం ఒక కథగా చూడకూడదు. తన ఉనికిని దైవ చరణాలకు అర్పించి, ప్రతి క్షణాన్నీ భగవంతుడి స్మరణగా మార్చుకున్న సాధనగా చూడాలి. అందుకే ఆమెను ‘భక్తి స్వరూపిణి’గా కీర్తిస్తారు. కృష్ణుడి ఆలయాల్లో ఆయనతో పాటు రాధను పూజించడం వెనుక కూడా ఇదే ఆధ్యాత్మిక భావన ఉంది. భగవంతుడిపై మనసును ఎలా లగ్నం చేయాలో రాధ భక్తులకు తెలియజేస్తుంది. ‘రాధే శ్యామ్‌’ అని స్మరించడం వల్ల భగవంతుడిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చని భక్తులు విశ్వసిస్తారు. రాధ రూపం మనకు చెప్పేది ఒక్కటే.. దైవాన్ని చేరుకోవడానికి గొప్ప ఆడంబరాలు అవసరం లేదు. నిర్మలమైన మనసు, నిష్కల్మషమైన విశ్వాసం, సంపూర్ణమైన శరణాగతి ఉంటే చాలు. రాధ అంటే భక్తి.. రాధ అంటే శరణాగతి.. రాధ అంటే శ్రీకృష్ణుడి చరణాలపై సంపూర్ణ విశ్వాసం. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





