
ఇన్‌సర్వీస్‌ టీచర్లలో ఉత్తీర్ణత 50.93 శాతం ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 16 వరకు 12 రోజుల పాటు జరిగిన పరీక్షలకు 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 90,862 మంది అభ్యర్థులు 99,591 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 45.63 శాతం ఉత్తీర్ణత నమోదైందని టెట్‌ కన్వీనర్‌ ఎం.వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘74,711 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 72,288 మంది 81,127 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 37,789 మంది 41,315 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. 50.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల నిర్వహణ అనంతరం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల్ని పరిశీలించి తుది కీ ఆధారంగా ఫలితాలు విడుదల చేశాం’’ అని వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ క్యాండెట్‌ లాగిన్‌తో https://tet2dsc.apcfss.in https://cse.ap.gov.in లేదా వెబ్‌సైట్‌లు, 95523 00009 వాట్సప్‌ నంబర్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని సూచించారు. అక్టోబర్‌-2025 టెట్‌ పరీక్షలకు 31,886 మంది ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయులు హాజరు కాగా, వారిలో 15,239 మంది (47.82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




