
దిల్లీ: వృత్తిపర సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ తెస్తున్న మార్పుల నేపథ్యంలో.. కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణకు అకౌంటింగ్, కన్సల్టింగ్‌ దిగ్గజ సంస్థ పీడబ్ల్యూసీ సిద్ధమైంది. ఏఐ నుంచి పెరుగుతున్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు అంతర్జాతీయ క్లయింట్‌లకు తక్కువ ఖర్చుతో సేవలు అందించేందుకు వీలుగా.. పీడబ్ల్యూసీ అమెరికా - భారత విభాగాలు తమ ఔట్‌సోర్సింగ్, కన్సల్టింగ్‌ కార్యకలాపాలను ఏకం చూస్తూ సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. భారత్‌లో పీడబ్ల్యూసీ అమెరికా నడుపుతున్న ఆఫ్‌షోర్‌ ‘యాక్సిలరేషన్‌ సెంటర్లు’, పీడబ్ల్యూసీ ఇండియా కన్సల్టింగ్‌ వ్యాపారాన్ని ఈ కొత్త సంయుక్త సంస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ కొత్త సంస్థ పరిధిలో దాదాపు 40,000 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. ఈ సంయుక్త సంస్థకు పీడబ్ల్యూసీ ఇండియా ప్రస్తుత ఛైర్మన్‌ సంజీవ్‌ క్రిషన్, సీఈఓగా వ్యవహరించనున్నారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఒప్పందం 2027 ప్రథమార్ధం నాటికి పూర్తికానుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





