
ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో రికర్వ్‌ స్వర్ణం కైవసం సాల్టిలో (మెక్సికో): ఆంధ్రప్రదేశ్‌ యువ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో పురుషుల రికర్వ్‌ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా అతడు ఘనత సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్లో అతను షూటాఫ్‌లో నకానిషి (జపాన్‌)పై విజయం సాధించాడు. నిర్ణీత వ్యవధిలో స్కోరు 5-5తో సమం కావడంతో షూటాఫ్‌ అనివార్యమైంది. అందులో ధీరజ్‌ 10 పాయింట్లు సాధించగా.. నకానిషి 9 పాయింట్లే రాబట్టాడు. ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ నుంచి మహిళల విభాగంలో డోలా బెనర్జీ (2007) మాత్రమే రికర్వ్‌ పసిడి నెగ్గింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





