
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CPS Abolition, OPS Restoration Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు అంశం గురించి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఓ సంకేంతం లభించింది. సీపీఎస్ ను రద్దు చేసి.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించే వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బుధవారం సీపీఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) ప్రతినిధి బృందం రాష్ట్ర మంత్రులను కలసి తమ విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ నేతృత్వంలో ప్రతినిధులు మంత్రులను కలసి సమస్య తీవ్రతను వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛను పథకాన్ని విజయాస్పదంగా అమలు చేస్తున్న విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలోనూ లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు.
మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌కు కూడా సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. సీపీఎస్ సమస్య తీవ్రత, ఉద్యోగుల అభ్యర్థనలపై ప్రత్యేకంగా ఒక సమగ్ర నోట్ (Special Note) తయారుచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా అందజేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుండి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తెలంగాణలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గత కొంతకాలంగా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ సంఘాలు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని రిటైరైన ఉద్యోగులకు ఆర్ధిక భద్రత కల్పించాలని సంఘాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. దీంతోపాటు పీఆర్సీ ప్రకటించాలని.. డీఎ బకాయిలు, పెండింగ్ బిల్లలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా పలు రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతూ ఆగస్టు 23వ తేదీ చలో హైదరాబాద్ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
2004 సెప్టెంబర్ 1 తర్వాత సీపీఎస్ పరిధిలోకి వచ్చిన దాదాపు 2.6 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ తర్వాత సామాజిక భద్రత కోల్పోతున్నారని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు చెందిన సుమారు రూ. 20,000 కోట్ల నిధులు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా ఉన్నాయని.. ప్రతినెలా మరో రూ. 200 కోట్ల మార్కెట్ పరం అవుతున్నాయంటూ టీఎస్ సీపీఎస్ ఈయూ ఆరోపిస్తోంది. హిమాచల్, జార్ఖండ్ వంటి ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను విజయవంతంగా అమలు చేస్తున్నందున తెలంగాణలోనూ అదే పద్ధతిని పాటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛను పథకాన్ని విజయాస్పదంగా అమలు చేస్తున్న విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలోనూ లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





