
దిల్లీ: వెస్టిండీస్‌తో సెప్టెంబరు 27న మొదలయ్యే వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ నియమితుడయ్యే అవకాశముంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ తిరువనంతపురంలో ఆరంభమవుతుంది. రెండో వన్డే ఈ నెల 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబరు 3న ముల్లన్‌పుర్‌లో జరుగుతాయి. ఈ సిరీస్‌కు జట్టును ఈ నెల 16న ప్రకటిస్తారు. విండీస్‌తో సిరీస్‌ సమయంలోనే ఆసియా క్రీడల టీ20 క్రికెట్‌ టోర్నీ జరగనున్నందున వన్డే రెగ్యులర్‌ వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులో ఉండడు. అతడు ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దీంతో వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను రాహుల్‌కు అప్పగించే అవకాశముంది. ఇషాన్‌ కిషన్‌ కూడా ఆసియా క్రీడల్లో ఆడనున్నందున రెండో వికెట్‌కీపర్‌ స్థానం కోసం పంత్, జురెల్‌ మధ్య పోటీ ఏర్పడింది. ఈ విషయంలో కెప్టెన్, కోచ్‌ అభిప్రాయం ముఖ్యమని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




