
చెంగ్డూ (చైనా): భారత యువ షట్లర్‌ తన్వి పత్రి సత్తా చాటింది. ఆసియా అండర్‌-17 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తన్వి 11-15, 15-10, 15-12తో మరో భారత షట్లర్‌ షైనా మణిముతుపై విజయం సాధించింది. తొలి గేమ్‌ కోల్పోయినా.. పుంజుకున్న తన్వి వరుసగా రెండు గేమ్‌లు ఖాతాలో వేసుకుని టైటిల్‌ సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో పత్రి 15-9, 11-15, 15-11తో యు యింగ్‌ గయ్‌ (చైనా)ను ఓడించింది. మరోవైపు అండర్‌-15 బాలుర డబుల్స్‌లో ఆదిత్య సింగ్‌ నేగి-తన్మయ్‌ వర్మ జంట కాంస్యం గెలిచింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




