
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల గురించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్‌ వోహ్రా బుధవారం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. ముందుగా గ్యాప్‌-1, 2లో జరుగుతున్న పనులు పరిశీలించారు. తొలుత పెండింగ్‌లోని డిజైన్‌లపై పీపీఏ కార్యదర్శి రఘురామ్‌తో కలిసి సమీక్షించారు. క్లే రిచ్‌లో 25 లెవెల్‌ వరకు డిజైన్లకు అనుమతులు వచ్చాయని, 53 లెవెల్‌ వరకు డిజైన్ల అనుమతి కోసం కేంద్ర జలసంఘం వద్ద ఉన్నట్లు జలవనరులశాఖ అధికారులు వివరించారు. మరికొన్ని డిజైన్లు పీపీఏ ద్వారా కేంద్ర జలసంఘం వద్దకు పంపామని, వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంను కుడివైపు కొండకు అనుసంధానం చేసే డిజైన్‌కు అనుమతి రావాల్సి ఉందని, ర్యాంపులు, కంట్రోల్‌ రూంలు, పరికరాల బిగింపు ప్రక్రియకు సంబంధించిన డిజైన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సీఈవోకు వివరించారు. ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, ప్రాజెక్టు ఎస్‌ఈ పి.రామచంద్రరావు, పలువురు ఈఈలు, నిర్మాణ సంస్థ, వ్యాప్కోస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో శాస్త్రవేత్తల పరీక్షలు: కేంద్ర జలసంఘంలోని మట్టి, రాయి పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు హరేంద్ర ప్రకాశ్, దీపముద్రనాయక్, గౌరవపాండేలు గ్యాప్‌-1, 2లో మట్టి, రాయికి సంబంధించిన పరీక్షలు జరిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





