
దేశంలోనే తొలిసారిగా అధునాతన ఇమేజింగ్ సదుపాయాలతో రూపొందించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎండోస్కోపీ వ్యవస్థను దేశ రాజధానిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది.
© 2026 nimisham.in

దేశంలోనే తొలిసారిగా అధునాతన ఇమేజింగ్ సదుపాయాలతో రూపొందించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎండోస్కోపీ వ్యవస్థను దేశ రాజధానిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది.
దిల్లీ: దేశంలోనే తొలిసారిగా అధునాతన ఇమేజింగ్‌ సదుపాయాలతో రూపొందించిన ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఎండోస్కోపీ వ్యవస్థను దేశ రాజధానిలో ఎయిమ్స్‌ ఏర్పాటు చేసింది. దీంతో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు మరింత ఆధునిక వైద్య సేవలు అందించే సామర్థ్యం ఆసుపత్రిలో పెరిగిందని ఎయిమ్స్‌ అధికారులు తెలిపారు. ఎయిమ్స్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి ఈపీ-6000 ఎండోస్కోపీ వ్యవస్థను ఫుజిఫిల్మ్‌ ఇండియా సంస్థ విరాళంగా అందించింది. అవసరమైన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో, సౌహార్ద చర్యగా ఈ పరికరాన్ని అందజేసినట్లు సంస్థ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఫుజిఫిల్మ్‌ ఇండియా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఎండోస్కోపీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోనే ఎండోస్కోపీ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటవడం సంతోషకరమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నిఖిల్‌ టాండన్‌ అన్నారు. రోగుల సంరక్షణను మెరుగుపరిచేందుకు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్లినికల్‌ ఆవిష్కరణలను ఎయిమ్స్‌ ప్రోత్సహిస్తోందని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








