
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో పబ్లిష్ అయిన నివేదిక ప్రకారం తమలపాకులో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ (యాంటీ బ్యాక్టీరియల్), ఎంజైమాటిక్ గుణాలు ఉంటాయి. ఇవి పిండి ఆరోగ్యకరంగా పులవడానికి (హెల్తీ ఫర్మెంటేషన్) సాయపడతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక వేడి వల్ల పిండి అతి త్వరగా పులిసిపోయి, కంపు వాసన లేదా అధిక పులుపు వస్తుంది. తమలపాకు చెడు బ్యాక్టీరియా చేరకుండా నిరోధించి, పిండి ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చేస్తుంది. తమలపాకుకు ప్రత్యేకమైన సువాసన, సహజ రుచి ఉంటాయి. పిండిలో రాత్రంతా ఈ ఆకు నానడం వల్ల దాని తేలికపాటి సువాసన పిండికి పడుతుంది. దీనివల్ల తయారైన ఇడ్లీలు మంచి ఫ్లేవర్తో, మరింత రుచిగా వస్తాయి. కొందరికి మినప్పప్పుతో చేసిన ఇడ్లీలు తిన్నప్పుడు కడుపుబ్బరం (bloating), గ్యాస్ లేదా అజీర్తి వంటి సమస్యలు వస్తుంటాయి. రిపోర్ట్ ప్రకారం తమలపాకు పిత్తాన్ని నియంత్రించి, వాత దోషాన్ని తగ్గిస్తుంది. జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, ఇడ్లీ తిన్నప్పుడు గ్యాస్ రాకుండా సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.