
ACB | బుధవారం అర్ధరాత్రి వేళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesra) పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రామా చోటు చేటు చేసుకుంది. సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలను ఏసీబీ అధికారులు(ACB) అరెస్ట్ చేయడంతో స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే..ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సీఐ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. లంచం తీసుకునే బాధ్యతను ఎస్ఐకి అప్పగించారు. ఇంతటితో ఆగని పోలీసులు సదరు నిందితుడితో వ్యక్తిగత పనులు చేయించుకోవడమే కాకుండా రోజు బిర్యాని, కూల్ డ్రింక్స్ తీసుకురావాలని ఆర్డర్ వేసేవారు. దీంతో విసిగిపోయిన నిందితుడు చేసేదేమి లేక ఏసీబీ అధికారులను సంప్రదించాడు.ఏసీబీ అధికారుల సూచనల మేరకు కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్ఐ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




