
గరివిడి: విజయనగరం జిల్లాలో దారుణ హత్య జరిగింది. ప్రియుడిని ప్రియురాలు హతమార్చింది. సహజీవనం చేస్తున్న జంట మధ్య ఘర్షణ జరిగి ఈ ఘటనకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరివిడి మండలం కందిపేటకు చెందిన దనాల రాములమ్మ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహితంగా మెలిగింది. అతడు కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు. కొంతకాలంగా రాములమ్మ, శ్రీను సహజీవనం చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున వీరిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బలంగా కొట్టింది. అనంతరం యాసిడ్‌ పోయడంతో తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రాములమ్మ పురుగుల మందు తాగడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





