
అనకాపల్లి పట్టణం: వినాయక చవితి వేడుకల్లో భాగంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో 16 వేల మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా వినాయక ప్రతిమతోపాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు. 60 వేల మొక్కలతో ఏర్పాటుచేసిన మండపం, ప్రతిమను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వినాయక చవితి రోజున సోమవారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు సస్యగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరిగాయి. దేవి శ్రీదేవి ఎంటర్‌ ప్రైజెస్ ఆధ్వర్యంలో చింతామణి దత్త క్షేత్రం ఆధ్వర్యంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



