
Varun Chakravarthy : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా కీలక స్పిన్నర్ సేవల్ని కోల్పోనుంది. రెండో మ్యాచ్ సన్నాహకాల్లో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అనుకోకుండా గాయపడ్డాడు. దాంతో, అతడు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. గాయంతో వరుణ్ అఫ్గనిస్థాన్ సిరీస్ నుంచి వైదొలిగాడని సోమవారం బీసీసీఐ వెల్లడించింది. త్వరలో జరుగనున్న ఆసియా క్రీడల్లోపు వరుణ్ కోలుకొని, ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అనేది భారత జట్టును కలవరపరుస్తోంది. ఇటీవల భారత ఆటగాళ్లు తరచూ గాయపడుతున్నారు. అఫ్గనిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపికైన వారిలో ఇప్పుడు వరుణ్ చక్రవర్తి గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమైన అతడికి కొత్త గాయమైంది. వరుణ్‌ను పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం విశ్రాంతి సూచించింది. According to reports, Varun Chakravarthy has suffered a side strain during the first T20I against Afghanistan in Delhi. pic.twitter.com/AD5QN4AMoN — CricTracker (@Cricketracker) September 14, 2026 ‘వరుణ్‌కు ఇప్పుడు కొత్త గాయం అయింది. ఎంఆర్ఐ స్కాన్‌లో పక్కటెముకల్లో సమస్య ఉంది. దాంతో, అతడు అఫ్గనిస్థాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో వరుణ్ ఆడడం అనుమానమే’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే వరుణ్ స్థానంలో ఇంకెవరిని స్క్వాడ్‌లోకి తీసుకోలేదు. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19నుంచి ఆసియాడ్ మొదలవ్వనుంది. అక్కడే ఆతిథ్య జట్టుతో దౌత్య సంబంధాల 75 ఏళ్లకు గుర్తుగా ఏకైక టీ20 ఆడనుంది టీమిండియా. సెప్టెంబర్ 24న జరుగనున్న ఈ మ్యాచ్‌కు కూడా వరుణ్ డౌటే అనిపిస్తోంది. ఇక.. అఫ్గనిస్థాన్‌తో రెండో టీ20 మంగళవారం జరుగనుంది.





