
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శెట్టూరు, న్యూస్‌టుడే: ప్రతి గ్రామంలో వినాయక చవితి పండగను ఎంతో భక్తిశ్రద్ధలతో సందడిగా జరుపుకొంటారు. వినాయకుడి నిమజ్జనం జరిగే దాకా ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలు చేపడతారు. శెట్టూరు మండలం బసంపల్లిలో మాత్రం ఈ పండగకు దూరంగా ఉంటారు. ఎందుకంటే గ్రామదేవత మారెమ్మ అమ్మవారి ఉత్సవాలు అదే సమయంలో నిర్వహించడమే ఇందుకు కారణం. వినాయక చవితి సోమవారం జరగనుండగా, మారెమ్మ ఉత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఏటా వినాయక చవితికి ఒకటి రెండు రోజులు అటూఇటుగా జరుగుతాయి. దీంతో ప్రతి ఇల్లు బంధుమిత్రులతో నిండిపోయి మాంసాహారం వండుతారు గనుక వినాయకుడు అపవిత్రం కాకూడదనే గ్రామస్థులు పండుగకు దూరంగా ఉంటున్నారు. చాలా ఏళ్లుగా గ్రామంలో ఈ ఆనవాయితీ కొనసాగుతున్నట్లు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




