
© 2026 nimisham.in

కళ్లకు ఆకట్టుకునే రంగుల్లో, ఎక్కువ కాలం తాజాగా ఉండే అందమైన పూల మొక్క బొగడబంతి. అందుకే, అలంకరణల్లో దీన్ని విరివిగా వాడుతుంటారు. కళ్లకు ఆకట్టుకునే రంగుల్లో, ఎక్కువ కాలం తాజాగా ఉండే అందమైన పూల మొక్క బొగడబంతి. అందుకే, అలంకరణల్లో దీన్ని విరివిగా వాడుతుంటారు. మరి మనమూ పెంచేద్దామా? బొ గడబంతి శాస్త్రీయ నామం గోంఫ్రినా గ్లోబోసా. ఇది అమరాంతేసి కుటుంబానికి చెందినది. దీన్ని వాడమల్లి, గుండు బంతి అని కూడా పిలుస్తారు. దీని స్వస్థలం మధ్య అమెరికా అయినా కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేపాల్‌ వంటి దేశాల్లో ఈ పూలను సంప్రదాయ వేడుకల్లో పూల మాలలుగా ఉపయోగిస్తారు. ముదురు గులాబీ, ఊదా, ఎరుపు, పసుపు, తెలుపు వర్ణాల్లో గుండ్రంగా విచ్చుకుంటాయి ఈ పూలు. ఇవి వెదజల్లే ఘాటైన సువాసన వల్ల కీటకాలు దరి చేరవు. బొగడ బంతి పూలను కోసిన తర్వాత కూడా చాలా రోజుల పాటు వాటి రంగూ, రూపాన్ని కోల్పోవు. అందుకే వీటిని ‘డ్రై ఫ్లవర్స్‌’ తయారీలో విరివిగా వాడతారు. అయితే, ఈ పూలను పట్టుకుని చూస్తే రేకలు మెత్తగా ఉండవు. కొద్దిగా గరుకుగా, కాగితపు పూలలా అనిపిస్తాయి. నిజానికి మనం చూసే రంగు భాగం రేకలు కాదు.. అవి బ్రాక్ట్స్‌(రూపాంతరం చెందిన ఆకులు). అసలైన పూలు చాలా చిన్నగా, బంతుల మధ్య దాగి ఉంటాయి. ఈ మొక్క తీవ్రమైన ఎండను, కరవును సైతం సమర్థవంతంగా తట్టుకుని పెరుగుతుంది. సీతాకోకచిలుకలను, తేనెటీగలను ఈ పూలు బాగా ఆకర్షిస్తాయి. రోజూ కనీసం 6-8 గంటల పాటు ప్రత్యక్ష సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. మొక్క బాగా ఎదుగుతుంది. పూలు ఎక్కువగా పూస్తాయి. తేలికపాటి ఇసుక నేలలు లేదా బాగా నీరు ఇంకిపోయే సారవంతమైన మట్టి దీనికి అనుకూలం. మట్టిలో తేమ ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు. విత్తనాలను నేరుగా మట్టిలో నాటుకోవచ్చు. కాస్త ఎదిగాక పైభాగాన్ని తుంచితే పక్క నుంచి కొమ్మలు వచ్చి, గుబురుగా తయారై ఎక్కువ పూలు పూస్తాయి. తడి ఎక్కువైతే ఆకు మచ్చల వ్యాధి లేదా బూజు తెగులు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి మొక్కల మధ్య తగిన దూరం ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే ఆర్గానిక్‌ ఫంగిసైడ్‌ వాడాలి. ఇక, మీ ఇంటికి సీతాకోక చిలుకలు, తేనెటీగల్ని ఆహ్వానించాలంటే బొగడ బంతి మొక్కల్ని పెంచడానికి మించిన గొప్ప ఉపాయం లేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.
