Nani's The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ ఇప్పటికే $350K (డాలర్లు) క్రాస్ అయ్యాయి. ఇప్పటివరకు 15,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ ప్రీమియర్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి




