
సౌత్ ఇండియన్ మోస్ట్ పాపులర్ కపుల్ సూర్య, జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఒక చర్చిలో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
© 2026 nimisham.in

సౌత్ ఇండియన్ మోస్ట్ పాపులర్ కపుల్ సూర్య, జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఒక చర్చిలో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
దక్షిణాది సినిమా పరిశ్రమలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూర్య- జ్యోతికల జోడి ఒకటని చెప్పవచ్చు. ఓ వైపు ఇద్దరూ యాక్టర్ గా తమ ప్రొఫెషనల్ లైఫ్ ను కొనసాగిస్తూనే మరోవైపు 20 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా తమ దాంపత్య బంధాన్ని కొనసాగిస్తున్నారీ లవ్లీక పుల్. 1999లో ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు సూర్య- జ్యోతిక. ఆ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత అది క్రమంగా ప్రేమగా చిగురించింది. ఆపై ఇరు పెద్దల ఆశీర్వాదంతో 2006 సెప్టెంబర్ 11న పెళ్లిపీటలెక్కారు సూర్య- జ్యోతిక. ఈ నేపథ్యంలో తమ 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారీ క్యూట్ కపుల్. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చర్చిలో మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్ కోసం తెలుగు రుంగు దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు సూర్య- జ్యోతిక. ముఖ్యంగా తెల్లటి బ్రైడల్ గౌనులో పాలరాతి శిల్పంలా కనిపించింది జ్యోతిక. అలాగే హీరో సూర్య కూడా బ్రైడల్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.ఇక 20 ఏళ్ల పెళ్లి వేడుకల్లో భాగంగా జ్యోతిక చర్చిలోకి అడుగుపెడుతున్న సమయంలో సూర్య బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో సోదరుడు కార్తి సూర్య పక్కనే ఉంటూ అభినందనలు చెప్పడం వంటి ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒక ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త ప్రమాణాలు చేసుకున్న అనంతరం సూర్య- జ్యోతికలపై అందరూ పూలవర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
Help others stay updated with verified breaking news and insights.






