
ఇంటర్నెట్‌ డెస్క్: గౌతమ్‌ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక (Rashmika) ప్రధానపాత్రలో సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత కథ తెరకెక్కనుంది. ‘ఎం.ఎస్‌’ అనే పేరుతో రానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడారు. ‘‘ఎంఎస్ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని గడిపారో చాలా మందికి తెలియదు. అమ్మ సంగీతాన్ని రీక్రియేట్ చేసే సాహసం మేం చేయడం లేదు. అనిరుధ్ సంగీతంతో ఒక గొప్ప బయోపిక్ రూపొందిస్తున్నాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ వీడియో చూశారా: ఆసక్తికరంగా తమన్నా ‘ది వాన్’ ట్రైలర్‌



