
ఇక ధీరజ్, రామరాజుల వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ. రామరాజు.. ఏంటీ అన్నట్టుగా సైగ చేస్తాడు. ప్రేమ.. తలదించేసుకుంటుంది. దాంతో రామరాజు.. "రేయ్.. ఒకవేళ నా భార్యే గనుక అలిగి పుట్టింటికి వెళ్లిపోయి ఉంటే ఈపాటికి ఎప్పుడో ఇంటికి తీసుకోచ్చేవాడిని. కానీ నువ్వు మాత్రం ఇంకా చాతకానీ చవటలాగే ఉన్నావు" అంటాడు ధీరజ్‌తో. "ఇంట్లో ఉన్న భార్యతో మాట్లాడటం తెలీదు కానీ.. ఇంటికి తీసుకోచ్చేవాళ్లంట " అంటూ నెమ్మదిగా కౌంటరిస్తాడు ధీరజ్. "భార్యను ఇంటికి తెచ్చుకోవడం తెలీదు గానీ నాన్న మీద పంచులు వేయడం బాగా తెలుసు" అని వెళ్లిపోతాడు రామరాజు. దీంతో ధీరజ్, ప్రేమ ఇద్దరూ బాధగా చూసుకుంటారు ఒకర్నొకరు. ఇక సేనాపతి ప్రేమ దగ్గరకు వచ్చి.. "నీతో కాస్త మాట్లాడాలమ్మా " అంటూ పక్కకు తీసుకెళ్తాడు. "ఈరోజు మన కుటుంబానికి చాలా ముఖ్యమైన రోజమ్మ. వేరే ఊరు నుంచి మన వంశం వాళ్లు, మన బంధువులు అందరూ వస్తున్నారు. ఆరోజు మీ చిన్నత్త పనివల్ల.. ఆ తర్వాత నువ్వు చేసిన పని వల్ల.. ఈ ఊరిలో దాదాపుగా మన పరువు అంత పోయింది. కానీ మన బంధువులు, మన వంశస్థుల దగ్గర మన పరువు ఇంకా అలాగే ఉంది. మనమంటే గౌరవం ఉంది. ఆ గౌరవ మర్యాద ధీరజ్ వల్ల ఏం పోదు కదమ్మా" అని అడుగుతాడు సేనాపతి. "అయ్యో.. ధీరజ్ వల్ల మన పరువు ఎందుకు పోతుంది. అలా ఎదుటివాళ్ల పరువు తీసేలా ఎప్పటికీ ప్రవర్తించడు నాన్న" అంటుంది ప్రేమ. "అలా చేస్తే అంతకన్నా కావాల్సింది మరొకటి లేదమ్మా. కాకపోతే నువ్వు మన ఇంటికి వచ్చేశావని ధీరజ్ మనందరి మీద కోపంగా ఉన్నాడు. ఆ కోపంతో మన ఇంటికి వచ్చిన వాళ్లతో గొడవ పెట్టుకుని మన పరువు తీస్తాడని ఏదో తెలియని భయం అమ్మా" అంటాడు సేనాపతి. "లేదు నాన్న ధీరజ్ పొరపాటున కూడా అలా చేయడు. నువ్వు టెన్షన్ పడకు నాన్నా" అంటూ హామీ ఇస్తుంది ప్రేమ. "సరే అమ్మ.. నువ్వు తొందరగా రెడీ అవ్వు. మన వాళ్లు సడెన్ గా ఎందుకు వస్తున్నారనుకుంటున్నావు. మీ అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడటానికి. మీ అన్నయ్య పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా. నిన్న మీ అత్తయ్య నీ మీద చేయి చేసుకుందని నువ్వు బాధపడకమ్మ. ధీరజ్ నిజంగా మారాడని నమ్మకం కలిగితే నేనే దగ్గరుండి నిన్ను అతడితోపాటు పంపిస్తాను " అని అంటాడు సేనాపతి... దీంతో ప్రేమ సంతోషంగా ఇంట్లోకి వెళ్లిపోతుంది. కట్ చేస్తే స్మితను కలవడానికి కాఫీ షాపుకు వెళ్తుంది నర్మద. అప్పటికే వెయిట్ చేస్తున్న స్మిత తను ఎంక్వైరీ చేసిన పేపర్స్ మొత్తం నర్మద చేతిలో పెడుతుంది. "ఈ ఎవిడెన్స్ మీదే విడిపోయిన ప్రేమ, ధీరజ్ లను కలపడం ఆధారపడి ఉంది " అంటుంది నర్మద. "ఇది వల్లి.. వాళ్ల అమ్మ నాన్నకు సంబంధించిన కాల్ డేటా. నువ్వు ఆరోజు వాళ్ల ఫోటోస్ చూపించిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. ప్రేమ, ధీరజ్ మోపిదేవి వెళ్లిన రోజే వల్లి వాళ్ల అమ్మ నాన్న కూడా మోపిదేవి వెళ్లారు. మోపిదేవి లోకేషన్ నుంచి వాళ్లు వల్లికి కాల్ చేసినట్లు పక్కా డేటా ఉంది" అంటుంది స్మిత. "ప్రేమ, ధీరజ్ లు ఆరోజు నాకు ఫోన్ చేసి మోపిదేవి వెళ్తున్నామని చెప్పారు. ఆ విషయం వల్లి వాళ్ల అమ్మనాన్నలకు ఎలా తెలుసు" అని ఆలోచిస్తుంది నర్మద. "అసలు ఆరోజు ప్రేమ, ధీరజ్ లకు ఫోన్ చేసింది ఒరిజినల్ ఎస్సై కాదు. అతడు ఒక ఫేక్ పర్సన్. వాడి గురించి ఎంక్వైరీ చేస్తుంటే పరారీలో ఉన్నట్లు తెలిసింది "అంటుంది స్మిత. "ప్రేమ, ధీరజ్ లకు ఫేక్ ఎస్సై ఫోన్ చేసి మోపిదేవి చెప్పడం.. వల్లి వాళ్ల పేరెంట్స్ మోపిదేవి వెళ్లడం.. అక్కడి నుంచి వాళ్లు వల్లికి ఫోన్ చేయడం ఇదంతా చూస్తుంటే మోపిదేవిలో జరిగిన ధీరజ్, ప్రేమల పెళ్లి గురించి తెలుసుకోవడానికి వాళ్లు ప్లాన్ చేశారని అర్థమవుతుంది" అని ఆలోచిస్తుంది నర్మద. "కావచ్చు. ఆ ఫేక్ ఎస్సై దొరికితే అసలు విషయం బయటపడుతుంది "అని చెబుతుంది స్మిత. "ఇంకా అసలు విషయం ఏంటీ. పాతికేళ్లుగా మా మామయ్యగారి మీద పగతో రగిలిపోతున్న ఆ భద్రావతి వాళ్ల అమ్మగారి పుట్టినరోజు వేడుకలు మా ఇంట్లో చేద్దామని అనడం వెనుకే అసలు విషయం ఏంటో అర్థమవుతుంది. ధీరజ్, ప్రేమల పెళ్లి గురించి కచ్చితంగా భద్రావతికి వల్లి చెప్పి ఉంటుంది. అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే మా ఇంట్లో బర్త్ డే చేశారు. కావాలని కుళ్లు పెట్టుకుని ప్రేమ, ధీరజ్ లను విడదీశారు" అంటుంది నర్మద. "నీకు ఇంకో పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పనా.. వల్లి ఫోన్ నుంచి భద్రావతికి ఒక్క కాల్ కూడా వెళ్లనట్టు డేటా ఉంది" అని స్మిత చెప్పడంతో నర్మద షాకవుతుంది. అప్పుడే వల్లి సిమ్ కార్డ్ చేతిలో పట్టుకుని "ఇది కేవలం భద్రావతితో మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించే సిమ్ కార్డ్. ఈ నంబర్ నాకు భద్రావతికి తప్పా మూడో కంటికి తెలియదు. అందుకే దీన్ని ఎవరి కంటికి కనిపించకుండా జాగ్రత్తగా దాస్తున్నా" అంటూ దాచిపెడుతుంది వల్లి. "అదేంటీ వల్లి భద్రావతితో మాట్లాడకుండా ఉండటమేంటీ"అని నర్మద అనడంతో "కానీ ఒక అనౌన్ నంబర్ నుంచి భద్రావతికి చాలా కాల్స్ వెళ్లాయి. ఆ నంబర్ గురించి పూర్తి డీటేయిల్స్ తెలియవు. మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ నంబర్ స్వీచ్ ఆఫ్ అని వస్తుంది. కానీ ఆ నంబర్ నుంచి కాల్ చేసిన లోకేషన్ మాత్రం మీ ఇంటి చుట్టుపక్కల మాత్రమే ఉంది. నాకు రెండు రోజుల టైమ్ ఇవ్వు ఆ ఫోన్ నంబర్ గురించి డీటెయిల్స్ నీకు చెప్తాను" అంటుంది స్మిత. " ఆ ఫోన్ నంబర్ ఎవరిదై ఉంటుంది. మా ఇంటి సరౌండిగ్స్ లో ఎవరు చేసి ఉంటారు" అని ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. మరోవైపు సిమ్ కార్డ్ దాచిపెట్టి "వామ్మో.. ఈ సిమ్ కార్డ్ దొరికితే నాకు సావే. పొరపాటున కూడా నా మొగుడు కూడా ఇది చూడకూడదు " అంటూ సిమ్ కార్డ్ దాచిపెడుతుంది వల్లి. ఇక ఇంటి ముందు భద్రావతి, సేనాపతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. "మన వాళ్లు ఎప్పుడెప్పుడు వస్తారా అని.. మనం అనుకున్న బీభత్సం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నాను రా" అంటుంది భద్రావతి. "అది కాదు అక్క. ధీరజ్ జీవితం నుంచి ప్రేమను శాశ్వతంగా దూరం చేయబోతున్నానని చెప్పావు. కానీ ఎలాగో చెప్పలేదు " అంటాడు సేనాపతి. "అది కాసేపట్లో నువ్వే చూస్తావు కదా" అని భద్రావతి చెప్తుండగానే బంధువులు ఇంటికి వస్తారు. దీంతో అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లి అందరిని పరిచయం చేస్తారు. వచ్చిన బంధువులు ప్రేమను చూసి "నీకు పెళ్లైంది కదా. మేము వస్తున్నామని అత్తగారి ఇంటి నుంచి వచ్చావా" అని ఒక బంధువు అడగడంతో అవును అంటాడు సేనాపతి. "అవునమ్మా మీ ఆయన ఏం చేస్తారు " అని మరొ బంధువు అడగడంతో "ఏం ప్రశ్న అది. జమీందారి ఇంటి మనవరాలు కదా. కచ్చితంగా ఆ స్థాయి ఇంటికే కోడలిగా పంపించి ఉంటారు" అని మరో బంధువు అనడంతో ప్రేమ, సేనాపతి సైలెంట్ అయిపోతారు. ఇక తర్వాత ఇంటికి వచ్చిన బంధువులు శారదాంబ కుటుంబం, భర్త గురించి పోగొడుతూ ఉంటారు. "మేనల్లుడికి పెళ్లి చేస్తానని భద్రావతి చెప్పగానే మీ ఇంటితో వియ్యం అందుకునే అదృష్టం ఏ ఇంటికి అందుతుందో అని అందరం ఇలా వాలిపోయాం" అని ఒక బంధువు అనడంతో కంగుతింటాడు విశ్వా. "అబ్బా.. అత్త ఏంటీ ఇలా షాకిచ్చింది" అని అనుకుంటాడు విశ్వా. "అసలు మిమ్మల్ని పిలిపించిన పర్పస్ వేరే ఉంది లే" అని మనసులోనే అనుకుంటుంది భద్రావతి. ఇక అందరూ విశ్వాతో అమ్మాయి గురించి మాట్లాడుతుండగా భద్రావతి ఇంటి బయట కొందరితో మాట్లాడుతూ.. "ఏం చేయాలో గుర్తుంది కదా. ధీరజ్ ఇక్కడకు రాగానే మొదలు పెట్టండి. వాడి రక్తం మరిగిపోవాలి. మీరు అన్న మాటలకు వాడు డైరెక్ట్‌గా మా ఇంట్లోకి వచ్చేయాలి" అని చెప్తుంది. "రేయ్.. ధీరజ్‌గా ..మొన్న నా మేనకోడలు నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాను అంటే నీకు అంత సీన్ లేదు అన్నావు కదరా. ఈ భద్రావతి స్కెచ్ వేస్తే ఎలా ఉంటుందో కాసేపట్లో నువ్వు చూడబోతున్నావు " అని వెళ్లిపోతుంది భద్రావతి. ఇక ధీరజ్ కారు ముందుకు రాగానే భద్రావతి ఇంటి ముందు ముగ్గురు నిలబడి "అమ్మాయి అందంగా ఉంది కదా. ఇంత అందమైన అమ్మాయి భార్యగా దొరకడం మనోడి అదృష్టం అంతే" అని మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ధీరజ్ వాళ్లదగ్గరకు వచ్చి "ఇంటి నిండా జనం ఉన్నారు. ఏమైందీ " అని అడుగుతాడు. "ప్రేమకు పెళ్లి చూపులు" అని చెప్పడంతో షాకవుతాడు ధీరజ్. వెంటనే ధీరజ్ కోపంగా ఇంట్లోకి వెళ్లి ప్రేమ అని గట్టిగా అరుస్తాడు. ప్రేమ చేతిలో ఉన్న ప్లేట్ విసిరికొట్టి అంతా రచ్చ రచ్చ చేస్తాడు. "ధీరజ్ ఏమైందీ. ఎందుకు ఇలా చేస్తున్నావు " అని అడుగుతుంది ప్రేమ కోపంగా. "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు. పళ్లు ఇకిలించుకుంటూ కూల్ డ్రింక్ ఇవ్వడానికి సిగ్గులేదా నీకు" అని ధీరజ్ అంటాడు. "తప్పేముంది. పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చారు. కూల్ డ్రింక్స్ ఇస్తున్నాను. ఇందులో తప్పేముంది. దానికి నువ్వెందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు" అని అంటుంది ప్రేమ. తప్పేముందా అంటూ లాగిపెట్టి కొడతాడు ధీరజ్. "రేయ్.. నా కూతురినే కొడతావా.. ఎంత ధైర్యం రా నీకు" అని ధీరజ్ కాలర్ పట్టుకుంటాడు సేనాపతి. "ఫీలవుతున్నావా.. నిన్ను కొట్టలేదని ఫీలవుతున్నావా" అంటూ సేనాపతిని సైతం లాగిపెట్టి కొడతాడు ధీరజ్. దీంతో బంధువులు షాకవుతూ ఈ అబ్బాయి ఏంటీ పట్టపగలే తాగి వచ్చాడా ఏంటీ అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. "రేయ్ ధీరజ్. బుద్ధుందా నీకసలు. ఇంటి నిండా మా చుట్టాలు, మా వంశం వాళ్లు ఉన్నారు. అందరి ముందు మా నాన్నను కొడతావా. మా నాన్న పరువు తీస్తావా" అని అడుగుతుంది ప్రేమ. "మనిషిని కాబట్టే కొట్టి వదిలేశాను. లేదంటే ప్రాణం తీసి ఉండేవాడిని. అసలు వాళ్లను కాదే నిన్ను అనాలి. ఎవరిని చేసుకుంటావే" అని అంటాడు ధీరజ్. "ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు. సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా" అంటుంది ప్రేమ. "ధీరజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు రా. ఎందుకు మా పరువు తీస్తున్నావు. మిమ్మల్ని అవమానంతో తల దించుకునేలా చేయకు. నీకు దండం పెడతాను వెళ్లరా" అంటూ నాటకం స్టార్ట్ చేస్తుంది భద్రావతి. "ప్రేమ భర్త అంట. ఇంత వరస్ట్ గా ఉన్నాడేంటీ. అవును మంచి మర్యాదల లేకుండా అందరి మీద చేయి చేసుకుంటున్నాడేంటీ. ప్రేమకు ఇలాంటి వెదవను ఇచ్చి పెళ్లి చేశారేంటీ " అని మాట్లాడుకుంటూ ఉంటారు బంధువులు. "ఆడదానివని ఆగాను. లేదంటేనా " అంటూ భద





