
ఇంటర్నెట్‌ డెస్క్: కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ సినిమాకు అందించిన సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. ఈనెల 22న గుజరాత్‌లోని కేవడియాలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అనంత్‌నాగ్‌ కన్నడతో పాటు తెలుగు, హిందీ, మరాఠి, మలయాళ, ఇంగ్లిష్‌ భాషల్లో 300పైగా సినిమాల్లో నటించారు. థియేటర్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. 1973లో కన్నడ చిత్రం ‘సంకల్ప’ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత శ్యామ్‌ బెనెగల్‌ రూపొందించిన ‘మంథన్‌’, ‘కొండుర’, ‘కల్‌యుగ్‌’ తదితర చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆర్‌కే నారాయణ్‌ కథల ఆధారంగా తెరకెక్కించిన ప్రసిద్ధ టెలీ సీరియల్‌ ‘మాల్గుడి డేస్‌’లో ఆయన మిఠాయివాలా పాత్రను పోషించారు. బయలుదారి, కన్నేశ్వర రామ, గోది బణ్ణ సాధారణ మైకట్టు, రాజకుమార, గాలిపట-2, కేజీఎఫ్‌ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. వెండితెర మీదే కాదు కర్ణాటక రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. మల్లేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2025లో అనంత్‌ నాగ్‌ కీర్తి కిరీటంలో ‘పద్మభూషణ్‌’ చేరింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంటర్నెట్‌ డెస్క్: ఇండస్ట్రీలో క్యూట్‌ కపుల్‌ అనగానే గుర్తొచ్చేది సూర్య (Suriya)- జ్యోతిక జోడీనే. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఘనంగా వేడుక చేసుకున్నారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’.




