
ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ను 2024కు గాను దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన కృషికి, ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానానికి గాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు కమిటీ సూచన మేరకు కేంద్రం దీన్ని ప్రకటించింది. ఈనెల 22న గుజరాత్‌లోని కేవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.




