
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యున్నత అవార్డ్‌గా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2024వ సంవత్సరానికి గాను కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ను వరించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో జరిగే 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అనంత్ నాగ్ ఈ అవార్డును అందుకోనున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అనంత్ నాగ్‌కు కన్నడ పరిశ్రమతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.





