
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక నవరాత్రి (Ganesh chaturthi) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని రాణిగారితోటలో దాదాపు 50 వేల చాక్లెట్లతో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం చిన్నారులను ఆకట్టుకుంటోంది. అనంతపురం జిల్లా వేణుగోపాల్‌ నగర్‌లో పాండాలపై బొజ్జ గణపయ్య కొలువుదీరాడు. నెల్లూరులోని స్టోన్‌హౌజ్‌పేటలో లక్ష లక్ష్మీకాసులతో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. రేబాలవారివీధిలో 695 చీరలతో వినాయకుడు, కడప జిల్లా పాతపేటలో టెంకాయ గణపతి ప్రతిమలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియో చూశారా: గుహ, మండువా, మహాభారతం.. ఆకట్టుకుంటోన్న గణేశ్‌ మండపాలు




