
22ఏతో ప్రభుత్వం వేధిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారని.. అది నిజం కాదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు.
© 2026 nimisham.in

22ఏతో ప్రభుత్వం వేధిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారని.. అది నిజం కాదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్‌: 22ఏతో ప్రభుత్వం వేధిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారని.. అది నిజం కాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. తమ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై శాసనసభలో సీఎం మాట్లాడారు. ప్రతిపక్షాల ఆరోపణలు నిజం కాదని చెప్పేందుకే ఈ అంశంపై చర్చ చేపట్టామన్నారు. ప్రధాన సమస్యలపై చర్చ నుంచి తప్పించుకునేందుకే విపక్షం యత్నిస్తోందన్నారు. చర్చ జరిగితే 22ఏ విషయంలో బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవకతవకలు బయటపడతాయని భావించే పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. ‘‘భూముల సమస్య వారసత్వంగా ఎలా వచ్చిందనే దానిపై చర్చ జరగాలి. నిజాం సర్కారు, ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలు, 22ఏ జాబితా సమస్యలు, కోర్టుల తీర్పులు వంటి అంశాలపై చర్చ చేపట్టాలి. కొందరు కొల్లగొట్టిన వేల ఎకరాల వివరాలను సభ ముందు ఉంచుతా. ధరణి పేరిట దోపిడీ జరిగి రూ.లక్షల కోట్ల ఆస్తి కొందరి చేతుల్లోకి మారింది. నిషేధిత భూముల సమస్యను మరింత జఠిలం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సృష్టించిన భూతం అందరినీ మింగేస్తుందని ఆయనపై కక్షాపూరిత ఆలోచనతో అబద్ధాలు ప్రచారం చేశారు. శ్రీనివాస్‌రెడ్డిది ఎంత బాధ్యతో ప్రభుత్వానిదీ అంతే బాధ్యత. ఈ సమస్యపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలి. సభ్యులు సూచన చేస్తే పేదలను ఆదుకునేందుకు మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వ ప్రతిపాదిత అంశాలను పరిశీలించి సలహాలు సూచనలు ఇవ్వాలి’’ అని రేవంత్‌ కోరారు. అసెంబ్లీ వద్ద పోలీసులు, మహిళలను కించపరిచేలా బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరించారని సీఎం విమర్శించారు. అర్ధనగ్న ప్రదర్శనలతో పోలీసులను దూషించారని.. స్పీకర్‌ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సభ్యులను సమావేశాల నుంచి స్పీకర్‌ బహిష్కరించారని చెప్పారు. సభ నిర్వహణపై గత ప్రభుత్వం కమిటీని నియమించి నిబంధనలు పెట్టిందన్నారు. సభలో ప్లకార్డులు, నినాదాలు ఉన్న ప్లెక్సీలు, దుస్తులతో రావొద్దని నిబంధనలు పెట్టారని... వాటినే అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ ద్వారా స్పీకర్‌ పోలీసులను ఆదేశించారని చెప్పారు. ఆ ఆదేశాలనే పోలీసులు అమలు చేస్తున్నారన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.