
ముంబై : ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ఉండే జీఎస్బీ (గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం, 335 కిలోల వెండి, రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ.703.27 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శనివారం నుంచే పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్నారు. జీఎస్బీ వినాయక చవితి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా నిలుస్తున్నాయి. కేవలం ఆభరణాలే కాకుండా.. నిత్యం వేలాది మందికి జీఎస్బీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నవరాత్రులు ఇక్కడ వేద సంప్రదాయాలు, ఆచారాలు, భజనలు, కీర్తనలతో పాటు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.





