మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ కలయికలో భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఓం రౌత్ వినిపించిన కథకు చరణ్ సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం. అయితే గతంలో 'ఆదిపురుష్' పేలవమైన గ్రాఫిక్స్, అభ్యంతరకర డైలాగుల కారణంగా తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొని భారీ పరాజయం చవిచూసింది. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్లో దూసుకుపోతున్న చరణ్, ఇంతటి నెగెటివిటీని ఎదుర్కొన్న దర్శకుడితో చేతులు కలపడం పెద్ద రిస్కేనని మెగా అభిమ





