
ఈ మధ్యన సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు, అభిప్రాయాలు బాగా మారిపోతున్నాయి. ఎవరు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అసలు అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా ఈ మధ్యన థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేసరికి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో థియేటర్ల వద్ద డిజాస్టర్‌గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పుడ మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా గత వారమే ఓటీటీలోకి వచ్చేసింది. అనూహ్యంగా ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వేదికపై టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ సినిమా మకుటం. ఈ సినిమాలో విశాల్ ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అభిమానులను బాగానే మెప్పించింది. అయితే తీరా థియేటర్లలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన మకుటం సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. రెగ్యులర్ యాక్షన్ సినిమా అని విశాల్ మూవీపై ఆడియెన్స్ పెదవి విరిచారు. దీనికి తోడు విశాల్ సినిమాకు పోటీగా సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ కావడం, సూపర్ హిట్ టాక్ రావడంతో మకుటం సినిమాకు ప్రతికూల అంశాలు గా మారాయి.



