
© 2026 nimisham.in


Apple Mega Event : ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆపిల్ ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. ఆపిల్ సెప్టెంబర్ 9వ తేదీ ఈవెంట్ కోసం రెడీ అవుతోంది. ఈ ఆపిల్ ఈవెంట్లో అనేక కొత్త ప్రొడక్టులను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్లో కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఐఫోన్ అల్ట్రా పేరుతో కంపెనీ ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్లో కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్, అప్డేట్ ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ మోడల్స్, అలాగే ఆపిల్ స్మార్ట్-హోమ్ ప్రొడక్టులకు సంబంధించిన అప్డేట్లను కూడా ఆవిష్కరించనుందని భావిస్తున్నారు.
సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు ఆపిల్ ఈవెంట్ లైవ్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్లో ఆపిల్ అనేక ప్రొడక్టులను ప్రకటించనుంది. మరికొన్ని ఈ ఏడాది చివరిలో రావచ్చని బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ నివేదించారు. ఇంకా ఏయే అప్ డేట్స్ ఉండొచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కొత్త ఐఫోన్ 18 లైనప్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మొదటగా మార్కెట్లోకి రానున్నాయి. ఆ తర్వాత 2027లో స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడళ్లు రానున్నాయి. ఆపిల్ అందించే ప్రో మోడల్స్, ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు.
అయితే, డైనమిక్ ఐలాండ్ చిన్నదిగా ఉండొచ్చు. ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా 24MPకి అప్‌గ్రేడ్ కావచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో వేరియబుల్-అపెర్చర్ ప్రైమరీ కెమెరా లాంగ్ ఆప్టికల్ జూమ్ ఉండొచ్చు. ఈ 2 ఫోన్లు ఆపిల్ 2nm A20 ప్రో చిప్సెట్ కొత్త C2 మోడెమ్‌తో వర్క్ చేస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌కు భారీ బ్యాటరీ కూడా ఉండనుంది.
ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాపై ఫోకస్ : ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ :
ఆపిల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతుంది. ఐఫోన్ అల్ట్రాలో 5.5-అంగుళాల కవర్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ ఐఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 7.8-అంగుళాల స్క్రీన్‌గా ఉంటుందని అంచనా.






