
దేవనకొండ: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా దేవనకొండలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ వెంకట్రామయ్య విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేవనకొండ మండలం పల్లె దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల జగన్ అనే ఇంటర్ విద్యార్థి జల్సాలకు అలవాటు పడ్డాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదించి విలాసంతమైన జీవితాన్ని గడపాలనుకుని వృద్ధులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న 69 ఏళ్ల వృద్ధురాలు దగ్గర రెండు తులాల బంగారు గొలుసును చోరీ చేశాడు. ఈ నెల 7న 68 ఏళ్ల రత్నమ్మ ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుండగా ఆమె మెడలో నుంచి 16, 10 గ్రాముల బంగారు గొలుసులను ఎత్తుకెళ్లాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నిందితుడి ముఖ ఆనవాళ్లు కనబడడంతో పోలీసులు ఈ కేసును పకడ్బందీగా దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం కర్నూలు బళ్లారి రహదారిలోని గద్దరాల స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న జగన్‌ను పట్టుకుని అరెస్ట్ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





