
ఏఐటీయూసీతోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తోందని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం కైరిగూడ ఓపెన్‌కాస్టు, సీహెచ్‌పీ, జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.





