
సామాజిక అంశాలకే ప్రాధాన్యమిస్తూ రూపకల్పన రాణిస్తున్న అనంత డైరెక్టర్లు జనని పోస్టర్‌ను విడుదల చేస్తున్న దుర్గ తమ్మినేని రాయదుర్గం పట్టణం, కమలానగర్‌ (అనంతపురం), న్యూస్‌టుడే: చెప్పే విషయం, చేసే పని, ఇచ్చే సందేశం, రాబోయే ఫలితం..ఇలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని లఘు చిత్రాలతో నలుగురిని ప్రభావితం చేస్తున్నారు కొత్త డైరెక్టర్లు.. ఈ కోవలో కొందరు ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. చిత్రాల్లో సామాజికహితం ఉండటంతో మన్ననలు అందుతున్నాయి. నేపథ్యం: హైదరాబాద్‌లో 12ఏళ్లపాటు చిత్రరంగంలో మేకప్‌ మ్యాన్‌గా, సహాయ దర్శకుడిగా పని చేసి దర్శకుడిగా ఎదిగారు. రుద్రమదేవి, అత్తారింటికి దారేది, నువ్విలా సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. సినిమా రంగంలో ఉన్న పరిచయాలతో స్థానిక యువకులను నటీనటులుగా ఎంపిక చేసుకుని ఇప్పటివరకు పదుల సంఖ్యలో లఘు చిత్రాలను తీశారు. నేపథ్యం: డ్యాన్సర్‌గా రాణిస్తూనే సమాజంలో జరుగుతున్న సంఘటల ఆధారంగా రీల్స్‌ వీడియోలు, డాక్యుమెంటరీ సన్నివేశాలు తీయడం, పల్లె చిత్రపాటలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తూ పేరు సంపాదించుకున్నారు. రైతుల ఇబ్బందులు, నిరుద్యోగుల అగచాట్లు, స్నేహం విలువ, ప్రేమ ఇలాంటి అంశాల మేళవింపుతో 4లఘు చిత్రాలు తీసి పలు అవార్డులు అందుకున్నాడు. అనంత ఫిలిం ఫెస్టివల్‌ కార్యక్రమంలో రైతు కష్టాలపై తీసిన ‘జనని’ లఘు చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు దక్కింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





