
తెలుగు చిత్ర పరిశ్రమలో బాలనటులుగా అలరించి.. ఆ తర్వాత హీరోహీరోయిన్లుగా మారిన నటీమణులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వెండితెరపై చిన్నతనంలోనే తమ అమాయకమైన చూపులతో, క్యూట్ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో బాలనటీమణులు.. కాలక్రమేణా గ్లామరస్ అండ్ పవర్ ఫుల్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. చిన్ననాటి నటన ద్వారా సంపాదించుకున్న గుర్తింపు, ఆ తర్వాత వారి కెరీర్ విజయాలకు ఎంతో దోహదపడింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోనూ చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు అలరించారు. తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్, మహేంద్రన్… ఇలా ఎంతో మంది చిన్నారులు ఇప్పుడు నటీనటులుగా అలరిస్తుంటే మరికొందరు సినిమాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టిపెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతుంది. అందులో కనిపించిన చిన్నారులు ఇప్పుడు క్రేజీ హీరోయిన్లు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందామా.






