
నేరస్థలానికే ఫోరెన్సిక్ ల్యాబ్ 26 జిల్లాలకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలు కేసుల పరిష్కారంలో మరింత వేగం: డీజీపీ గుప్తా అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలను వేగవంతం చేయడానికి, ఘటనా స్థలంలోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించడానికి రాష్ట్రంలో అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను ప్రారంభించామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ వాహనాలు నేరం జరిగిన స్థలానికి చేరుకుని.. కీలక ఆధారాలు గుర్తిస్తాయని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో





