
దిల్లీ: దేశ రాజధానిలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలు చేపట్టినప్పుడు పోలీసులు దమనకాండ సాగించారన్న ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీలో మార్పులు చేసేది లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కమిటీపై చేస్తున్న ఆరోపణలన్నీ ఊహాజనితమని, ముందే ఒక అభిప్రాయానికి వచ్చి.. వాటిని ఆపాదిస్తున్నారని వ్యాఖ్యానించింది. నిష్పాక్షికంగా, పారదర్శకంగా, న్యాయమైన రీతిలో అత్యుత్తమ ప్రమాణాలతో పనిచేసి.. విచారణలో తమకు సహకరించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం స్పష్టంచేసింది. ఇంకా విచారణ మొదలుపెట్టకముందే కమిటీపై ముద్ర వేయాలనుకుంటున్నారని, తామైతే ఎలాంటి మార్పు చేయడం లేదని ఈ నెల 10న ఇచ్చిన తీర్పులో తెలిపింది. దీనిని మంగళవారం ఆన్‌లైన్‌లో చేర్చారు. పెల్లెట్‌ గన్‌ల వాడకం, కొందరిని లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడటం, విద్యార్థినుల్ని వేధించడం, ఇరువైపులా ఆస్తుల విధ్వంసం వంటి అంశాలపై కమిటీ తన విచారణను చేపట్టవచ్చని పచ్చజెండా చూపింది. సున్నితమైన సాక్షులకు తగిన రక్షణ కల్పించాలని, వారి వివరాలు బహిర్గతం చేయవద్దని తెలిపింది. పిటిషనర్లలో ఒకరి తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ- విచారణను ఎదుర్కొనే అవకాశం ఉన్న ఒక ఉన్నతస్థాయి వ్యక్తికి కమిటీలో ఒకరు సన్నిహిత మిత్రుడని, అందువల్ల దానిని మార్చాలని కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.