
తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని తలపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలను తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించే క్రమంలో డిసెంబర్ నెలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. పారిశ్రామిక ప్రగతి సాధిస్తే రాష్ట్ర పురోగతి సాధ్యం అవుతుందని తెలంగాణా సర్కార్ భావిస్తోంది.ప్రజాభవన్‌లో వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతి సమీక్షఈ క్రమంలో ఇన్వెస్ట్‌ తెలంగాణ పేరుతో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్‌లో వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సీనియర్‌ అధికారులను బాధ్యులుగా నియమించాలని చెప్పారు.తెలంగాణా రాష్ట్రానికి మేఘ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు!తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు ప్రపంచానికి చెప్పేలా ప్లాన్ఈమేరకు ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్‌ సంజయ్‌ జాజు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్ -2026కు లోగో రూపొందించాలని, అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు.బ్రాండ్ తెలంగాణా.. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్!విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులకు ఆహ్వానంఅంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం కోసం అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానించాలని, హైదరాబాద్‌ ప్రధాన కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే సమయంలో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ 25వ వార్షికోత్సవంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్‌ గ్రీన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.గ్రీన్ టెక్నాలజీలో అగ్రస్థానంరాష్ట్రాన్ని దక్షిణ కొరియా, జపాన్‌ స్థాయికి తీసుకెళ్లాలని, సుస్థిర గ్రీన్‌ టెక్నాలజీలో అగ్రస్థానం సాధించాలని చెప్పారు. గ్రీన్‌ భవనాలు ఖరీదైనవనే అపోహను తొలగించి, సూర్యరశ్మి, నీరు, విద్యుత్‌ను సమర్థంగా వినియోగించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, సామూహిక గృహాల్లో కూడా గ్రీన్‌ విధానాలు అమలు చేయాలని ఐజీబీసీతో కలిసి పనిచేయాలని తెలిపారు.





