
Smriti Mandhana : మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు మరికొన్ని గంటలే ఉంది. ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టిన టీమిండియా విజయంపై భరోసాతో ఉండగా.. మరో ధనాధన్ ఆడేందుకు సిద్ధమవుతోంది ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana ). అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్‌తో రికార్డు నెలకొల్పిన మంధాన ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు నిరుడు అర్ధాంతరంగా పెళ్లి రద్దవ్వడం.. ఆ తదనంతర పరిణామాల నుంచి తేరుకొని ఆటపై దృష్టి సారించిన తను క్రికెట్ గురించి మాత్రమేమాట్లాడుతానని స్పష్టం చేసింది. ఆసియా కప్‌లో అదరగొడుతూ అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల మహారాణిగా అవతరించిన స్మృతి మంధాన భావోద్వేగానికి లోనైంది. పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ‘మీ జీవితంలో అతి కష్టంగా గడిచిన రాత్రి ఏది?’ అని పాడ్‌కాస్టర్ రాజ్ శమాని అడుగగా ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. ఆ రోజును తలచుకొని.. ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగిన మంధాన కొన్ని వరల్డ్ కప్స్ అని చెప్పింది. 🚨When Smriti Mandhana slept with affirmations under her pillow and bought her mom a house by 18🚨 Question 🗣️: Smriti, how did your mentor build that ruthless discipline and self-belief in you from age 14? Smriti Mandhana🗣️: “From age 14 to 19, my mentor had me waking up at 5… pic.twitter.com/jpisOgUi2l — sportified (@sportified25) September 12, 2026 ఏ వరల్డ్ కప్, ఏ మ్యాచ్ అనేది ఏదీ తను పేర్కొనలేదు. మీడియా గురించి బాగా తెలిసిన తను మాత్రం.. నేను క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుతా అని చెప్పేసింది. కొవిడ్-19 సమయం కూడా తనకు చాలా కష్టంగా ఉందని మంధాన తెలిపింది. దాంతో, నిరుడు బాలీవుడ్ గాయకుడు పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు గురించి టీమిండియా వైస్ కెప్టెన్ నోటి ద్వారా ఏదైనా చెప్పించాలని ప్రయత్నించిన అతడికి నిరాశే మిగిలింది. పాడ్‌కాస్టర్ : మీరు ప్రతీకారం తీర్చుకుంటారా? మంధాన : నేను ప్రతీకారాలను నమ్మను. నాతో ఎవరూ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేరు. నాతో మజాక్లు ఆడొద్దు. నేను మీ దారిలోకి రానంతవరకూ నా దారిలోకి రావద్దు. నేను ప్రతీకారం తీర్చుకోను. అలాఅనీ నేను ఏదీ మరచిపోను. ఇతరులకు హాని కూడా చేయను. పాడ్‌కాస్టర్ : ఇతరులను తేలికగా క్షమిస్తారా? మంధాన : నేను ఎవరినైనా క్షమిస్తాను. కానీ, వాళ్లను మాత్రం మరచిపోను. నేను కోప్పడే రకం కాదు. కానీ నాలో చాలా కోపం ఉంటుంది. పాడ్‌కాస్టర్ : మీరు ఏడుస్తారా? మంధాన : ఏడుస్తాను. అప్పుడప్పుడు బాత్రూమ్లో ఏడుస్తా. ఎవరైనా ఉంటే మాత్రం ఏడవను. Question – “Did you cry ?”. Smriti Mandhana – May be bathroom sometimes & shower. May be not front on some two people. Question – “Do you remember when you cry on last time ?”. Smriti Mandhana – “I don’t remember the last time I cried because I don’t cry in real life. I cry… pic.twitter.com/hnvek2xxVj — VIKAS (@Vikas662005) September 13, 2026






