
నాగర్‌ కర్నూల్‌లో హత్య కేసును ఛేదించిన పోలీసులు నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌లో హోటల్‌ నిర్వాహకుడు కరీమ్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక రామ్‌నగర్‌ కాలనీలోని తన ఇంట్లో కరీమ్‌ ఈ నెల 10న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కరీమ్‌ను ప్రియుడితో కలిసి భార్య సలీమా హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ్ముడు వరసయ్యే గౌస్‌ పాషాను కరీమ్‌ తన హోటల్‌లో పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సలీమా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన సలీమా.. తనపై అనుమానం రాకుండా తాను ఇంట్లో లేనప్పుడు చంపాలని గౌస్‌ పాషాకు చెప్పింది. హత్య కుట్రలో భాగంగా సలీమా.. ఈ నెల 9న నెల్లూరు దర్గాకు వెళ్లింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కరీమ్‌ను కత్తితో పొడిచి గౌస్‌పాషా హత్య చేశాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
