
వృత్తిఉద్యోగాల హడావిడిలో పడిపోయి కొంతమంది దంపతులు ఒకరికొకరు తగిన సమయం కేటాయించుకోలేకపోతుంటారు. ఇక పనివేళలు, సెలవు రోజులు వేర్వేరుగా ఉన్న వారైతే ఒకే ఇంట్లో ఉన్నా.. హాయ్, బైలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంటుంది.
వృత్తిఉద్యోగాల హడావిడిలో పడిపోయి కొంతమంది దంపతులు ఒకరికొకరు తగిన సమయం కేటాయించుకోలేకపోతుంటారు. ఇక పనివేళలు, సెలవు రోజులు వేర్వేరుగా ఉన్న వారైతే ఒకే ఇంట్లో ఉన్నా.. హాయ్‌, బైలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ ఉరుకుల పరుగుల జీవితం ఆరోగ్యాన్నే కాదు.. అనుబంధాన్నీ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కాపురంలో కలతలు రావడానికి ఇదీ ఓ కారణమే అని చెబుతున్నారు. ఏదేమైనా.. పనివేళలు, సెలవు రోజుల్లో తేడాల వల్ల అనుబంధానికి ముప్పు వాటిల్లకూడదంటే.. ఆలుమగలు కొన్ని చిట్కాలు పాటించడం ముఖ్యమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
భార్యాభర్తలిద్దరికీ షిఫ్టు సమయాలు వేరైనప్పటికీ రోజులో ఏదో ఒక సమయం ఇద్దరికీ అనువుగా ఉండచ్చు. ఓరోజు మధ్యాహ్నం లంచ్‌ సమయానికి ఇద్దరూ ఇంట్లోనే ఉండచ్చు.. లేదంటే రాత్రిళ్లు కలిసి భోజనం చేసే అవకాశం దొరకచ్చు.. మరో రోజు ఉదయాన్నే కలిసి వ్యాయామం చేయడానికి వీలు కుదరచ్చు.. ఇంకో రోజు కలిసి ఇంటి పనులు, వంట పని చేసుకునేందుకు సమయం కలిసి రావచ్చు. అయితే ఇలాంటప్పుడు కొంతమంది మొబైల్స్‌, టీవీలకు అతుక్కుపోవడం.. ఇంకొంతమంది దొరక్క దొరక్క ఖాళీ సమయం దొరికిందని తమకు నచ్చిన పనుల్లో లీనమవడం.. వంటివి చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులతో సమయాన్ని వృథా చేసుకోకుండా.. భాగస్వామితో గడపడానికి కేటాయిస్తే.. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు.. దీనివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ దెబ్బతినకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే పని ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం పొందచ్చు.
కాపురమన్నాక కలతలు, గొడవలు సహజం. వీటికి తోడు కెరీర్‌ పరంగా ఇద్దరూ బిజీగా ఉండడం వల్ల కలిసి గడపలేకపోతున్నామన్న ఒత్తిడి ఇద్దరిలోనూ సహజం. ఇవి మానసికంగా కుంగదీస్తాయి. ఈ చిరాకుతోనూ భార్యాభర్తలిద్దరి మధ్యా గొడవలు రావచ్చు. అయితే వీటిని నిర్లక్ష్యం చేస్తే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇద్దరికీ ఉమ్మడిగా దొరికిన ఆ కాస్త సమయంలోనే ఓ పావు గంటో, అరగంటో కేటాయించి.. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడం మేలంటున్నారు నిపుణులు. అలాగే ఒకరి కష్టసుఖాల్ని మరొకరు పంచుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం కూడా.. బిజీ లైఫ్‌స్టైల్లో అనుబంధాన్ని దృఢం చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలే అంటున్నారు.
దాంపత్య బంధంలో శృంగారానిది కీలక పాత్ర. అయితే చాలామంది తీరిక లేని పనివేళలు, షిఫ్టుల్లో మార్పుల కారణంగా దీనికీ తగిన సమయం కేటాయించలేకపోతారు. మరికొందరు పని ఒత్తిళ్లతో సతమతమవుతూ లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. ఫలితంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. పరిస్థితి ఇక్కడి దాకా రాకూడదంటే.. ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇద్దరికీ దొరికిన సమయాన్నే ఇందుకు సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ వెకేషన్స్‌కి ప్లాన్‌ చేసుకోవడం.. వంటివి ఇద్దరినీ దగ్గర చేస్తాయంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
Powered By Margadarsi Computers
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings






